Skip to main content

Posts

దేశాలు వారికి కావాల్సినంత డబ్బు ఎందుకు ముద్రించవు?

 ప్రతీదేశం తన డబ్బుని తానే తయారుచేసుకుంటుంది. మరి అలాంటప్పుడు దేశం యొక్క దుర్భర స్థితిని మార్చేందుకు  కావాల్సినంత డబ్బులు ముద్రించవచ్చు కదా? అలా చేసి దేశాన్ని ధనిక దేశం గా మార్చవచ్చు కదా? అన్న సందేహం ఎవరికైనా రావచ్చు. ఎంతో మంది ప్రజలు తినడానికి తిండి లేక, ఉండటానికి ఆవాసం లేక ఇబ్బంది పడుతున్నారు కదా, మరి అలాంటి వాల్లకోసమైన ఎక్కువ డబ్బులు ముద్రించి వల్ల జీవితాలు మార్చవచ్చు కదా? అయితే ప్రతీ దేశం తన డబ్బుని తానే ముద్రించుకుంటుంది, కానీ దేశం లో ఎంత డబ్బు చలామణి లో ఉండాలి అన్న దానికి ఒక నిర్దిష్టత ఉంటుంది. మనదేశం నే ఉదాహరణ గా తీసుకుంటే, రిసర్వ్ బాంక్ ఆఫ్ ఇండియా ఒకవేళ డబ్బులు ముద్రించాలనుకుంటే, మన దేశం యొక్క జీడీపీ, ఇంకా ఇతర విలువల్ని ఆధారంగా చేసుకుని, కేంద్ర ప్రభుత్వానికి అర్జీ పెట్టడం జరుగుతుంది. కేంద్రం ఆమోదన తర్వాత కొత్త నోట్లు ముద్రించబడతాయి. అయితే కేంద్రం గనక ఏ రిపోర్ట్ లు పరిగణించకుండా కొత్త నోట్ల ముద్రణకు ఆదేశాలు ఇవ్వొచ్చు. కానీ అలా చేయడం వల్ల inflation ఏర్పడే ప్రమాదం ఉంది.  సింపుల్ గా చెప్పాలంటే, ఒకవేల RBI అధిక మొత్తం లో నోట్ల ను ముద్రించి, మార్కెట్ లోకి వదిలింది అనుకుందాం. మార్కెట్

News that need attention.

పాఠశాలలో సమాధి. 1). కెనెడా లోని కంలూప్స్ అనే సిటీలో ఒక మూసివేయబడ్డ పురాతన   పాఠశాల (రెసిడెన్షియల్) ఆవరణలో 215 మంది పిల్లల శవాల్ని పూడ్చిపెట్టిన ప్రదేశం వెలుగులోకి వచ్చింది. ఈ శవాలకి సంబంధించి ఎటువంటి రికార్డ్ ప్రభుత్వం దగ్గర గాని , పాఠశాల ఫైల్స్ లో గాని పొందుపరచలేదు. ఒకే సారి ఇన్ని సమాధులు వెలుగులోకి రావడం ప్రపంచం మొత్తాన్ని విస్మయానికి గురి చేసింది.  ల్యాండ్ సర్వే ల కోసమని అక్కడి ప్రభుత్వం పని చెప్పటగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇప్పటికె కెనడా ప్రభుత్వం పైన ఇటువంటి పాఠశాలల్లో జరిగిన కొన్ని అవమానియ సంఘటనల పై కోర్టు లో కేస్ లు నడుస్తున్నాయి. ఈ రెసిడెన్షియల్ పాఠశాలల నిర్వహణకు సరైన నిధులు ప్రభుత్వం ఇవ్వకపోవడం, పిల్లలకి సరైన పోషకాహారం లభించకపోవడం, వైద్యం కరువవడం, పైగా అధ్యపకులచే పిల్లలు ఇబ్బందికి (హింస) గురికావడం వంటివి పిల్లల మరణాలకు కారణాలు అయ్యి ఉండవచ్చని భావిస్తున్నారు. అయితే ఈ మరణాల విషయం బయటకు పొక్కకుండా, పాఠశాల ఆవరణ లొనే సమాధి చేశారు. ఇదే పాఠశాలలో చదువుకున్న విద్యార్థులు తమ అనుభావాల్ని మీడియా తో పంచుకోవడం జరిగింది. ఒక వ్యక్తి ప్రకారం "ఈ పాఠశాలలో చదవడం అనేది భయంకర విషయం. జైలు

సైలెంట్ పేషెంట్ - ఒక మంచి థ్రిల్లర్ (Book)

. .మీకు పుస్తకాలు చదివే అలవాటు ఉందా? అందులోనూ క్రైమ్ మరియు సైకలాజికల్ పుస్తకాలు చదవడానికి ఇష్ట పడతారా? అయితే మీరు ఈ పుస్తకం (నవల) తప్పకుండా చదివి తీరాల్సిందే. పలు చిత్రాలకు స్క్రీన్ రైటర్ గా పనిచేసిన "అలెక్స్ మైఖెలీడిస్ (Alex Michaelides)" రచయితగా చేసిన తొలి ప్రయత్నం "ది సైలెంట్ పేషెంట్ (The Silent Patient)". ఈ నవల న్యూయార్క్ టైమ్స్ (Newyork times) మరియు సన్ డే టైమ్స్ (Sunday Times) వారి బెస్ట్ సెల్లర్ బుక్స్ లో ఒకటిగా నిలిచి చాలా మంది పాఠకుల చే ప్రశంశలు కూడా పొందింది. ఈ నవల మొత్తం ఒక హత్య చుట్టూ తిరుగుతూ ఉంటుంది. చిత్రకారిని (Artist) అయిన ఒక మహిళ తన భర్తను అతి క్రూరంగా 5 సార్లు తలపై (point blank లో) కాల్పులు జరిపి చంపేస్తుంది. ఆ హత్య వెనుక ఉన్న కారణాలు తెలుసుకోవడానికి ఒక సైకోతెరపిస్టు జరిపే ప్రయత్నమే ఈ సైలెంట్ పేషెంట్. హత్య చేసిన మహిళ, ఆ సంఘటన తర్వాత అసలు ఎవరితో మాట్లాడకుండా, మానసికంగా కృంగిపోయి ఒక ఆసుపత్రి లో చేర్చబడుతుంది, ఆమెతో మాట్లాడించి నిజం తెలుసుకోవడానికి ఒక తెరపిస్టు జరిపే ప్రయత్నం "ది సైలెంట్ పేషెంట్". నవల మొదట్లో కొంచెం మెల్లిగా సాగుతున్నట్టు అ

భగవంతుని తో ఇంటర్వ్యూ

  ఖుశ్వంత్ సింగ్ గారు  రచించిన "God and Godmen of india" అనే పుస్తకం లో భారతదేశం లోని మతాలు, ప్రజల విశ్వాసాల గురించి తన స్వీయానుభవ సంఘటనల ని చాలా చక్కగా వివరించడం జరిగింది. ఈ పుస్తకం చదువుతుంటే, కొన్ని చోట్ల కొన్ని ప్రశ్నలు మనకు ఎదురయ్యినట్టుగానే అనిపిస్తుంది. నేను ఇంకా ఈ పుస్తక పఠనం పూర్తి చెయ్యకపోయినప్పటికి, ఇందులోని ఒక  సంపుటి నచ్చి దానిని తెలుగు లోని అనువదించి ,నా మిత్రులతో పంచుకోవాలి అనిపించింది.  . ఇక విషయం లోకి వెళ్తే, కోల్కతా కి చెందిన అరునా కపూర్ అనే వనిత  వ్రాసిన లేఖని ఖుశ్వంత్ సింగ్ గారు ఈ పుస్తకం లో ప్రస్తావించడం జరిగింది. దానిని ఉన్నది ఉన్నట్టుగా కింద అనువదించడం జరిగింది. "భాగవంతుడితో ఒక ఉహాత్మక ఇంటర్వ్యూ జరిపినట్టు,  కోల్కతా కి చెందిన అరుణా కుమార్ ఒక చిన్న మరియు ఆనందకరమైన ఉత్తరాన్ని (High on waves అనే పేరుతో) నాకు వ్రాయడం జరిగింది. ఆ ఉత్తరాన్ని నా పాఠకులతో పంచుకోవాలనుకుంటున్నాను. నేను భగవంతుణ్ణి ఇంటర్వ్యూ చేసినట్టుగా కలగన్నాను. ఆ దేవుడు నన్ను చూడగానే, "లోపలికి రా" అని ఆహ్వానించి, "నీవు నన్ను ఇంటర్వ్యూ చెయ్యాలని అనుకుంటున్నావ్ కదా?&quo

స్వీడన్ లో అసలేం జరుగుతుంది?

ఆగష్టు 28, శుక్రవారం నాడు ఇస్లాం మతానికి వ్యతిరేకంగా జరుగుతున్న చర్యలని నిరసిస్తూ సుమారు 300 మంది ప్రజలు స్వీడన్ నగరమైన మాల్మో లో నిరసన చేపట్టారు, ఇందువల్ల అక్కడ అల్లర్లు చెలరేగాయి. వార్త మాధ్యమాల ప్రకారం నిరసనకారులు పోలీస్ ల పైకి రాళ్లు రువ్వడం మరియు వాహనాల టైర్ లు తగలబెట్టడం జరిగింది.   అల్లర్లకు గల కారణం:  ముస్లిం ల పవిత్ర గ్రంధమైనా ఖురాన్ ని స్ట్రాం కుర్స్ అనే డేనిష్ పార్టీ కి చెందిన నాయకులు తగలబెట్టడం తో అక్కడ అల్లర్లు చెలరేగాయి . డేనిష్ లాయర్ రాస్ముస్ పలుదో అనే వ్యక్తి 2017 వ సంవత్సరం లో స్థాపించిన పార్టీ స్ట్రాం కుర్స్. రాస్ముస్ మొదటినుండి ఇస్లాం వ్యతిరేకుడని పేరు ఉంది. ఏప్రిల్ 14 నాడు తన అధ్యక్షతన జరిగిన ఒక సమావేశం లో ఖురాన్ ని విసిరివేయడం ద్వారా వార్తల్లో నిలిచాడు రాస్ముస్. అలాగే తన ఇస్లాం వ్యతిరేక చర్యలలో భాగంగా యూట్యూబ్ లో రెచ్చగొట్టే వీడియొ లు పోస్ట్ చేయడం మరియు తన పార్టీ సామజిక మాధ్యమాల్లో కూడా అడపాదడపా ఇస్లాం వ్యతిరేక పోస్ట్ లు చేసేవారు. ఈ చర్యల వాళ్ళ రాస్ముస్ గతం లో 3 నెలల జైలు శిక్ష కూడా అనుభవించాడు.   అల్లర్లు జరగడానికి ముందు, పార్టీ నాయకుడు రాస్ముస్ మాల్మో నగరం

సుశాంత్ కేస్ : వైరల్ అవుతున్న రియా - మహేష్ భట్ వాట్సాప్ చాట్.

బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానాస్పద మృతి కేసుని సీబీఐ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. రోజులు గడిచేకొద్దీ ఈ కేసు విషయంలో అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. జాతీయ మీడియా ఛానళ్ల దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సుశాంత్ కేసులో మొదటి నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్న అతని గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి మరియు దర్శకనిర్మాత మహేష్ భట్ మధ్య జరిగిన వాట్సాప్ చాటింగ్ బయటకి వచ్చింది. దీనిని బట్టి సుశాంత్ చనిపోవడానికి ఆరు రోజుల ముందు జూన్ 8న రియా వాట్సాప్ ఛాటింగులో తన బాయ్ ఫ్రెండ్ సుశాంత్ ను విడిచిపెట్టినట్లు మహేష్ భట్ కు చెప్పినట్లు తెలుస్తోంది. రియా తండ్రికి సుశాంత్ పై సదభిప్రాయం లేదని.. అందుకే సుశాంత్ ను వదిలేయాలని మహేష్ భట్ రియాకు సలహా ఇచ్చాడని వాట్సాప్ ఛాట్ ద్వారా అర్థం అవుతోంది. ఈ ఛాటింగ్ 'జలేబీ' చిత్రంలో రియా చక్రవర్తి పోషిస్తున్న ఆయేషా పాత్ర పేరిట మహేష్ భట్ తో ఛాటింగు చేసినట్లు వెల్లడైంది. 'జలేబీ' చిత్రానికి మహేష్ భట్ - ముఖేష్ భట్ ప్రొడ్యూసర్స్ కావడం గమనార్హం. కాగా ఈ వాట్సాప్ ఛాటింగ్ ప్రకారం ''భారమైన హ

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ని చంపడానికి స్టన్ గన్ ఉపయోగించారా ..?

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ మరణం వెనుక మాఫియా హస్తం అలాగే బాలివుడ్ పెద్దల హస్తం ఉండొచ్చని ఇప్పటికె ఎన్నో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అతను మరణించిన సమయం నుండి ఇప్పటివరకూ ప్రతీరోజు ఎదో ఒక కొత్త వార్త వొస్తునే ఉంది. ఈ కేస్ ని సుప్రీం కోర్ట్ సీబీఐ కి బదిలీ చేస్తూ, మహారాష్ట్ర పోలీస్ వారు సేకరించిన సమాచారాన్నంత సీబీఐ కి అప్పగించాల్సిందిగా ఆదేశించడం విదితమే.    ఈ కేస్ కి సంబంధించి ఇంటర్నెట్ లో చాలా మంది వారి అనుమానాలను వ్యక్తపరుస్తున్నారు. అలాగే రాజు వాధ్వ అనే ఒక వ్యక్తి ఒక యూట్యూబ్ వీడియో కామెంట్ లో చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.  సుశాంత్ సింగ్ ని స్టన్ గన్ ఉపయోగించి చంపి ఉంటారని అతను అభిప్రాయ పడ్డాడు.స్టన్ గన్ ఉపయోగించిన చోట కొంతసేపు శరీర అవయవాలు పక్షవాతం వచ్చి పనిచేయవని చెప్పారు. సుశాంత్ దేహాన్ని గమనిస్తే గనక అతని మెడ ఎడమ వైపు స్టన్ గన్ మర్క్స్ ఉన్నాయని, అలాగే అతని ఎడమ వైపు మొహం పక్షవాతం వోచినట్టుగా ఉన్నదని అందుకే అతని ఎడమ కన్ను తెరిచి ఉందని అతను పేర్కొనడం జరిగింది. అమెరికా లో కూడా ఒక వ్యక్తిని ఇలాగే చంపి ఆత్మహత్య గా చిత్రీకరించే ప్రయత్నం చేయగా ఫోరెన్సిక్ వాళ్ళు హత్యగా దృవీకరించార