అల్లర్లకు గల కారణం:
ముస్లిం ల పవిత్ర గ్రంధమైనా ఖురాన్ ని స్ట్రాం కుర్స్ అనే డేనిష్ పార్టీ కి చెందిన నాయకులు తగలబెట్టడం తో అక్కడ అల్లర్లు చెలరేగాయి . డేనిష్ లాయర్ రాస్ముస్ పలుదో అనే వ్యక్తి 2017 వ సంవత్సరం లో స్థాపించిన పార్టీ స్ట్రాం కుర్స్. రాస్ముస్ మొదటినుండి ఇస్లాం వ్యతిరేకుడని పేరు ఉంది. ఏప్రిల్ 14 నాడు తన అధ్యక్షతన జరిగిన ఒక సమావేశం లో ఖురాన్ ని విసిరివేయడం ద్వారా వార్తల్లో నిలిచాడు రాస్ముస్. అలాగే తన ఇస్లాం వ్యతిరేక చర్యలలో భాగంగా యూట్యూబ్ లో రెచ్చగొట్టే వీడియొ లు పోస్ట్ చేయడం మరియు తన పార్టీ సామజిక మాధ్యమాల్లో కూడా అడపాదడపా ఇస్లాం వ్యతిరేక పోస్ట్ లు చేసేవారు. ఈ చర్యల వాళ్ళ రాస్ముస్ గతం లో 3 నెలల జైలు శిక్ష కూడా అనుభవించాడు.
అల్లర్లు జరగడానికి ముందు, పార్టీ నాయకుడు రాస్ముస్ మాల్మో నగరం లో "నోర్డిక్ దేశాల్లో ఇస్లామీకరణ" అనే సమావేశాన్ని జరపకూడదని ఆదేశించాడు. అక్కడే ఖురాన్ తగలబెట్టబడుతున్నదని వార్తలు వెలువడ్డాయి. ఈ నిర్ణయమే నిరసనకారుల ఆగ్రహానికి కారణం గా పరిగణించవచ్చు. గత డేనిష్ ఎన్నికల్లో రాస్ముస్ ప్రధానంగా స్వీడన్ లో ఉంటున్న 300000 మంది దేశ బహిష్కరణ చేసి స్వీడన్ ని ముస్లిం రహిత దేశంగా మార్చాలి అన్న నినాదం తో పోటీలో దిగాడు. స్వీడన్ లో వలస దారుల వాళ్ళ దేశ ప్రజలకి మరియు ఆర్ధిక వ్యవస్థకి ప్రమాదం అన్నది అతని వాదనగా మొదటినుండి నడుస్తున్నాడు. శుక్రవారం జరిగిన అల్లర్ల తరువాత అక్కడి ప్రభుత్వం రాస్ముస్ ని రెండు సంవత్సరాల పాటు దేశం నుండి బహిష్కరిస్తున్నట్టు తెలిపింది.
శరణార్ధుల ప్రభావం:
మార్చిలో బ్రూకింగ్స్ ప్రచురించిన ఒక నివేదిక ప్రకారం,కెనడా మరియు ఆస్ట్రేలియా దేశాల తరువాత ఎక్కువ మొత్తం లో శరణార్థులని అక్కున చేర్చుకున్న దేశం స్వీడన్. ఫలితంగా శరణార్థులకు సురక్షితమైన స్వర్గధామంగా స్వీడన్ మారింది. 2013 - 2014 కాలంలో షిరియా మరియు పలుదేశాల్లో జరిగిన అల్లర్ల వల్ల దేశాన్ని వొదిలి ఆశ్రయం కోసం వోచిన సిరియన్లందరికీ స్వీడన్ శాశ్వత నివాస అనుమతి ఇచ్చింది. సిరియా లో యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటివరకు సుమారు 70,000 మంది సిరియన్లు స్వీడన్‌కు వచ్చి నివసిస్తున్నారు అని ఒక అంచనా.
నివేదిక ప్రకారం, 2015 లో, సిరియా, ఇరాక్ మరియు ఆఫ్ఘనిస్తాన్ నుండి ఆశ్రయం కోసం రికార్డు స్థాయిలో 162,000 దరఖాస్తులను అందుకుంది స్వీడన్. మరియు యుద్ధం కారణంగా దెబ్బతిన్న దేశాల నుండి ముస్లిం శరణార్థుల ప్రవాహం స్వీడిష్ రాజకీయాలపై గణనీయమైన ప్రభావాన్ని చూపింది.
స్వీడన్ పార్లమెంటు యొక్క మూడవ అతిపెద్ద పార్టీ మరియు నియో-నాజీయిజం మూలాలు కలిగి ఉన్న మితవాద స్వీడన్ డెమొక్రాట్లు ఇటీవలి సంవత్సరాలలో ముస్లిం వలసదారుల ప్రవాహం నేరాల పెరుగుదలకు దారితీసిందని మరియు 2015-2016 నుండి వలస సంక్షోభం సంభవించిందని తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు, ఫలితంగా ప్రజల్లో కూడా వలసదారుల పట్ల స్వీడన్ అనుసరిస్తున్న తీరు కి వ్యతిరేకత ఏర్పడింది. శరణార్థుల వల్ల స్వీడన్ ఆర్థిక వ్యవస్థ దెబ్బ తింటున్నదని అక్కడి ప్రజలు భావిస్తున్నారు.
ప్రజల కోసం అత్యుత్తమ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న దేశాల్లో స్వీడన్ ఒకటి. చాలా పెద్ద సంఖ్య లో తరలి వస్తున్న శరణార్ధుల్లో ఎక్కువ మంది నైపుణ్యం లేని వారు మరియు చదువు లేని వారు కావడం తో వారు ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ఆధారపడి జీవిస్తారని, ఫలితంగా ప్రజల పై పన్ను భారం ఎక్కువగా పడే అవకాశం ఉంది అన్నది అక్కడి ప్రజల అభిప్రాయం గా పేర్కొనవచ్చు.
2018 లో స్వీడన్ లో నిరుద్యోగిత రేట్ 3.8 శాతం ఉండగా, విదేశాల్లో పుట్టి స్వీడన్ లో శాశ్వత నివాసం పొందిన వారిలో నిరుద్యోగం 15 శాతం గా ఉంది. శరణార్థులు వొచ్చి స్వీడన్ పథకాలను అప్పనంగా ఆరగిస్తున్నారని అక్కడి ప్రజలు విశ్వసిస్తున్నారు.
Nice blog
ReplyDeletehttps://www.telugunetflix.com