Skip to main content

సైలెంట్ పేషెంట్ - ఒక మంచి థ్రిల్లర్ (Book)

.మీకు పుస్తకాలు చదివే అలవాటు ఉందా? అందులోనూ క్రైమ్ మరియు సైకలాజికల్ పుస్తకాలు చదవడానికి ఇష్ట పడతారా? అయితే మీరు ఈ పుస్తకం (నవల) తప్పకుండా చదివి తీరాల్సిందే. పలు చిత్రాలకు స్క్రీన్ రైటర్ గా పనిచేసిన "అలెక్స్ మైఖెలీడిస్ (Alex Michaelides)" రచయితగా చేసిన తొలి ప్రయత్నం "ది సైలెంట్ పేషెంట్ (The Silent Patient)". ఈ నవల న్యూయార్క్ టైమ్స్ (Newyork times) మరియు సన్ డే టైమ్స్ (Sunday Times) వారి బెస్ట్ సెల్లర్ బుక్స్ లో ఒకటిగా నిలిచి చాలా మంది పాఠకుల చే ప్రశంశలు కూడా పొందింది. ఈ నవల మొత్తం ఒక హత్య చుట్టూ తిరుగుతూ ఉంటుంది. చిత్రకారిని (Artist) అయిన ఒక మహిళ తన భర్తను అతి క్రూరంగా 5 సార్లు తలపై (point blank లో) కాల్పులు జరిపి చంపేస్తుంది. ఆ హత్య వెనుక ఉన్న కారణాలు తెలుసుకోవడానికి ఒక సైకోతెరపిస్టు జరిపే ప్రయత్నమే ఈ సైలెంట్ పేషెంట్. హత్య చేసిన మహిళ, ఆ సంఘటన తర్వాత అసలు ఎవరితో మాట్లాడకుండా, మానసికంగా కృంగిపోయి ఒక ఆసుపత్రి లో చేర్చబడుతుంది, ఆమెతో మాట్లాడించి నిజం తెలుసుకోవడానికి ఒక తెరపిస్టు జరిపే ప్రయత్నం "ది సైలెంట్ పేషెంట్". నవల మొదట్లో కొంచెం మెల్లిగా సాగుతున్నట్టు అనిపిస్తున్నప్పటికి, చదువుతున్న కొద్దీ ఎదో ఉత్సుకత మొదలవుతుంది పాఠకులకి. నవల మొత్తం అతి కొద్ది మంది చుట్టూ తిరుగుతూనే పాఠకులకి కావాల్సిన థ్రిల్లింగ్ పంచుతుంది. చివరి చాప్టర్ కి పాఠకుడు చేరుకునే సరికి ఒక మంచి థ్రిల్లింగ్ నవల చదివామన్న ఒక అభిప్రాయనికి వస్తారని కచ్చితంగా చెప్పగలను.

ప్లాట్:
అలిసియా అనే ఒక పేరున్న చిత్రకారిని ఒక సాయంత్రం వేళ తన భర్త అయిన గాబ్రియేల్ ని అతి క్రూరంగా చంపేస్తుంది. పాయింట్ బ్లాంక్ లో గన్ పెట్టి ముఖంపై 5 సార్లు కాల్పులు జరిపి చంపేస్తుంది. అయితే ఈ ఘటన తర్వాత ఆమెని పోలీస్ లు అదుపులోకి తీసుకొని విచారిస్తారు, కానీ ఆమె ఒక్క మాట కూడా మాట్లాడదు, మానసిక రోగి లా మారిపోయి ముగదానిలా ప్రవర్తిస్తుంది. ఆమెతో మాట్లాడించి నిజం రాబట్టాలని ఎంత మంది ప్రయత్నించినా ఫలితం ఉండదు. ప్రజల దృష్టి లో అలిసియా ఒక హాంతకురాలిగా, జాల, దయ లేని క్రూరురాలిగా మిగిలిపోతుంది. గాబ్రియేల్ ని ఆమె చంపిందా లేదా మరేమైన జరిగి ఉంటుందా అనేది ఆమె చెప్తే కానీ తెలియదు. అలిసియా ని ఒక మానసిక రోగి గా పరిగణించి ఆమెని నార్త్ లండన్ లోని గ్రోవ్ (Grov) అనే ఒక మానసిక వైద్య ఆసుపత్రి లో ఉంచుతారు.

ఇక కధ లో మరో కీలకమైన పాత్రధారి థియో ఫెబర్ (Theo Fabre). ఈ నవల మొత్తం ఇతను వివరిస్తున్నట్టుగా (narrate) ఉంటుంది. అంటే మొత్తం కధ ఇతను చెప్తున్నట్టుగా ఉంటుంది. థియో ఒక క్రిమినల్ సైకోతెరపిస్టు (మానసిక వైద్య నిపుణుడు). అలిసియా తో ఎలాగైనా మాట్లాడించాలి అనే ఒక ఆశయం తో ఉంటాడు. క్రైమ్ జరిగిన కొన్ని సంవత్సరాల తర్వాత అతనికి ఆ అవకాశం వస్తుంది. అలిసియా కి తనదైన పద్దతిలో వైద్యం చేస్తూ ఉంటాడు. చివరికి అలిసియా మాట్లాడిందా, తన భర్తని తానే చంపిందా? హత్యకు దారితీసిన పరిస్థితులు ఏంటి? అనేది ఉత్సుకత రేకేతించే అంశం.

ఈ నవలని క్రిమినల్ థ్రిల్లర్ అనడం కంటే సైకలాజికల్ థ్రిల్లర్ అని అనవచ్చు. ప్రతీ చాప్టర్ లో ఒక ట్విస్ట్, మెలిక ఉండేలా రచయిత ఈ నవలని రూపొందించాడు. అందువల్ల నవల చదువుతున్నంత సేపు విసుగు రాకుండా ఉంటుంది. కధ క్రైమ్ చుట్టూ కాకుండా పాత్రధారులు మరియు వారి మానసి.క పరిస్థితుల గురించి చదువుతున్నట్టుగా ఉంటుంది.

కొన్ని గమనించదగ్గ quotes:

1). Remember, Love that doesn't include honesty doesnt reserved to be called love.

2). Unexpressed emotions will never die. They are buried alive and will come forth later, in uglier ways. -sigmund freud

3). There’s so much pain everywhere, and we just close our eyes to it. The truth is we’re all scared. We’re terrified of each other.

4). You know, one of the hardest things to admit is that we weren’t loved when we needed it most. It’s a terrible feeling, the pain of not being loved.

Comments

Popular posts from this blog

స్వీడన్ లో అసలేం జరుగుతుంది?

ఆగష్టు 28, శుక్రవారం నాడు ఇస్లాం మతానికి వ్యతిరేకంగా జరుగుతున్న చర్యలని నిరసిస్తూ సుమారు 300 మంది ప్రజలు స్వీడన్ నగరమైన మాల్మో లో నిరసన చేపట్టారు, ఇందువల్ల అక్కడ అల్లర్లు చెలరేగాయి. వార్త మాధ్యమాల ప్రకారం నిరసనకారులు పోలీస్ ల పైకి రాళ్లు రువ్వడం మరియు వాహనాల టైర్ లు తగలబెట్టడం జరిగింది.   అల్లర్లకు గల కారణం:  ముస్లిం ల పవిత్ర గ్రంధమైనా ఖురాన్ ని స్ట్రాం కుర్స్ అనే డేనిష్ పార్టీ కి చెందిన నాయకులు తగలబెట్టడం తో అక్కడ అల్లర్లు చెలరేగాయి . డేనిష్ లాయర్ రాస్ముస్ పలుదో అనే వ్యక్తి 2017 వ సంవత్సరం లో స్థాపించిన పార్టీ స్ట్రాం కుర్స్. రాస్ముస్ మొదటినుండి ఇస్లాం వ్యతిరేకుడని పేరు ఉంది. ఏప్రిల్ 14 నాడు తన అధ్యక్షతన జరిగిన ఒక సమావేశం లో ఖురాన్ ని విసిరివేయడం ద్వారా వార్తల్లో నిలిచాడు రాస్ముస్. అలాగే తన ఇస్లాం వ్యతిరేక చర్యలలో భాగంగా యూట్యూబ్ లో రెచ్చగొట్టే వీడియొ లు పోస్ట్ చేయడం మరియు తన పార్టీ సామజిక మాధ్యమాల్లో కూడా అడపాదడపా ఇస్లాం వ్యతిరేక పోస్ట్ లు చేసేవారు. ఈ చర్యల వాళ్ళ రాస్ముస్ గతం లో 3 నెలల జైలు శిక్ష కూడా అనుభవించాడు.   అల్లర్లు జరగడానికి ముందు, పార్టీ నాయకుడు రాస్ముస్ మాల్మో నగరం

ఈ చైనా అప్లికేషన్ ని తక్షణమే మీ ఫోన్ నుండి తొలంగించండి.

ఆండ్రాయిడ్ యూజర్లను తమ బ్యాంక్ ఖాతాల నుండి డబ్బును హరించే ప్రముఖ అప్లికేషన్ గురించి నిపుణులు హెచ్చరిస్తున్నారు. చైనా వాళ్ళు తాయారు చేసిన ఈ అప్లికేషన్ ని వినియోదారులు తక్షణమే తొలగించవలసిందిగా వారు కోరుతున్నారు.ఆ యాప్ పేరు స్నాప్ ట్యూబ్ . ఈ అప్లికేషన్ ప్రీమియం సభ్యత్వాల నుండి ఇప్పటికే 78  మిలియన్లు సంపాదించినట్లు ది ఎక్స్‌ప్రెస్ వెలువడించింది. యూట్యూబ్ మరియు ఫేస్‌బుక్ నుండిసులభంగా వీడియోలను డౌన్‌లోడ్ చేయడానికి స్నాప్‌ట్యూబ్ అనే అప్లికేషన్ ని చాలా మంది ఆండ్రాయిడ్ ఫోన్ వినియోగదారులు ఉపయోగిస్తున్నారు  - ఇప్పటికే ఈ అప్లికేషన్ ని ౪ కోట్ల కంటే ఎక్కువ సార్లు ఆండ్రాయిడ్ ప్లే స్టోర్ నుండి డౌన్‌లోడ్ చేయబడింది. ఈ ఆప్ ప్లే స్టోర్ నుండి ఉచితంగానే డౌన్లోడ్ చేస్కునే వీలుంది. అయితే దీనిని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత వినియోగదారుల ప్రమేయం లేకుండా, ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వకుండా ప్రీమియం సభ్యత్వం లో నమోదు అవుతుందని, దాని వల్ల ప్రతీ నెల ఆటోమేటిక్ గా ఆ సభ్యత్వానికి అవసరమైన డబ్బు వినియోగదారుల బ్యాంకు అకౌంట్ నుండి ఛార్జ్ చేయబడుతుందని (అమెజాన్ లేదా నెట్ ఫ్లిక్స్ లో సభ్యత్వం కొరకు నెల నెల డబ్బులు కట్ అయినట్టుగా) నిప

ఫోక్స్ వాగన్ కార్ల గ్రేవ్ యార్డ్ ని చూసారా!!!

2015 లో బయటపడిన డీజిల్ ఉద్గార కుంభకోణం ఫలితంగా Volksvagon (ఫోక్స్ వాగన్) అమెరికాలో సుమారు మూడున్నర లక్షల కార్లను తిరిగి కొనుగోలు చేసింది. 7.4 బిలియన్ల అనగా 740 కోట్లను వెచ్చించి ఈ కార్లను తిరిగి కొన్నది. అయితే ఆ కొన్న అన్ని కార్లను ఎక్కడ ఉంచింది. పని చేయని విమానాలన్నింటిని ఒక చోట ఉంచే ప్రదేశం గ కాలిఫోర్నియా లోని విక్టర్ విల్లే అనే ప్రదేశానికి పేరుంది. అదే ప్రదేశానికి సమీపంలో కొన్ని వేల ఎకరాలను లీజ్ కి తీసుకుని ఫోక్స్ వాగన్ తాము తిరిగి కొన్న కార్లను ఉంచింది. ఈ అతిపెద్ద కార్ల సమాధిని చూడడానికి పర్యాటకులు తరలి వొస్తుంటారట.   అయితే ఈ కార్లను తిరిగి బాగుచేసి మల్లి అమ్మకానికి పెట్టడమో లేదా ధ్వంసం చేయడమో చేస్తారట. ఇప్పటికే 20000  కార్ల ను ధ్వంసం చేసినట్టుగా వారు వెల్లడించారు. ఈ అతిపెద్ద కార్ల స్థావరాన్ని మీరు చుడండి...