Skip to main content

దేశాలు వారికి కావాల్సినంత డబ్బు ఎందుకు ముద్రించవు?

 ప్రతీదేశం తన డబ్బుని తానే తయారుచేసుకుంటుంది. మరి అలాంటప్పుడు దేశం యొక్క దుర్భర స్థితిని మార్చేందుకు  కావాల్సినంత డబ్బులు ముద్రించవచ్చు కదా? అలా చేసి దేశాన్ని ధనిక దేశం గా మార్చవచ్చు కదా? అన్న సందేహం ఎవరికైనా రావచ్చు. ఎంతో మంది ప్రజలు తినడానికి తిండి లేక, ఉండటానికి ఆవాసం లేక ఇబ్బంది పడుతున్నారు కదా, మరి అలాంటి వాల్లకోసమైన ఎక్కువ డబ్బులు ముద్రించి వల్ల జీవితాలు మార్చవచ్చు కదా?

అయితే ప్రతీ దేశం తన డబ్బుని తానే ముద్రించుకుంటుంది, కానీ దేశం లో ఎంత డబ్బు చలామణి లో ఉండాలి అన్న దానికి ఒక నిర్దిష్టత ఉంటుంది. మనదేశం నే ఉదాహరణ గా తీసుకుంటే, రిసర్వ్ బాంక్ ఆఫ్ ఇండియా ఒకవేళ డబ్బులు ముద్రించాలనుకుంటే, మన దేశం యొక్క జీడీపీ, ఇంకా ఇతర విలువల్ని ఆధారంగా చేసుకుని, కేంద్ర ప్రభుత్వానికి అర్జీ పెట్టడం జరుగుతుంది. కేంద్రం ఆమోదన తర్వాత కొత్త నోట్లు ముద్రించబడతాయి. అయితే కేంద్రం గనక ఏ రిపోర్ట్ లు పరిగణించకుండా కొత్త నోట్ల ముద్రణకు ఆదేశాలు ఇవ్వొచ్చు. కానీ అలా చేయడం వల్ల inflation ఏర్పడే ప్రమాదం ఉంది.

 సింపుల్ గా చెప్పాలంటే, ఒకవేల RBI అధిక మొత్తం లో నోట్ల ను ముద్రించి, మార్కెట్ లోకి వదిలింది అనుకుందాం. మార్కెట్ అంటే ఏమిటి ప్రజలు, అంటే ప్రజల చేతుల్లో అప్పటికె ఉన్న ధనం తో పాటు కొత్తగా వదిలిన డబ్బు కూడా వచ్చి చేరుతుంది. ఇలా ప్రజల వద్ద అధిక మోతాదులో ధనం ఉండడం వల్ల "తయారీ విధానం (productivity)" దెబ్బతింటుంది. ఎలాగంటే ప్రతీ ఒక్కరు ధనం కోసమే పని చేస్తారు, కానీ అదే ధనం చేతిలో ఉంటే పని మానేసి ధనం ఖర్చు పెడుతూ జీవిస్తారు. For example : ఒక వ్యక్తి ఒక బిస్కెట్ తయారీ చేసే ఫేక్టరీ లో పని చేస్తున్నాడనుకుందాం. Inflation వల్ల అతని దగ్గరికి డబ్బు ఎక్కువగా వచ్చి చేరింది అనుకుందాం. అప్పుడు ఆ వ్యక్తి దగ్గర అధికంగా డబ్బులు ఉన్నందున అతనికి ఆ ఫేక్టరీ లో పని చేసే అవసరం ఉండదు. తద్వారా బిస్కెట్ తయారీ చేసే వ్యక్తి పని మానేయడం వల్ల కొత్త గా బిస్కెట్స్ తయారీ చేసేవారుండరు. అటువంటప్పుడు, అప్పటికె మార్కెట్ లో ఉన్న బిస్కెట్స్ కి డిమాండ్ ఎక్కువగా పెరుగుతుంది.  (డిమాండ్ ఎక్కువగా ఉండి సప్లై తక్కువ అవుతుంది). ప్రజల దగ్గర ఇబ్బడిముబ్బడి గా డబ్బులు ఉండడం మూలాన బిస్కెట్స్ ని అధిక ధరకు కొనడానికి సిద్ధపడుతారు. ఇక్కడ జరిగిందేదంటే... బిస్కెట్స్ తయారు చేసే వారు లేరు, ఉన్న వాటికి కి డిమాండ్ పెరిగి వాటి ధరలు అధిక మొత్తం లో పెరిగాయి. అంటే for example 10 rupees  ఉన్న బిస్కెట్ inflation వల్ల 100 అయింది అనుకోండి. అప్పుడు రూపాయి విలువ పెరిగినట్టా? తగ్గినట్టా? తగ్గినట్టు. ఇప్పుడు ఇదే సమస్య ఒక 2 సంవత్సరాలు మన దేశం లో ఉందనుకోండి. మొదటి నెల 10rs ఉన్న బిస్కెట్ 100 అవుతుంది, 2 నెల 100rs ఉన్నది 150rs అవుతుంది. ఇలా నెల నెలకి ధరలు మారిపోతూ రూపాయి విలువను అట్టడుగు కి తోసేస్తాయి. 2 సంవత్సరాలలో 10rs ఉన్న బిస్కెట్స్ 2000 అయిన ఆశ్చర్యపోనక్కరలేదు. ఈ ప్రభావం దేశం లోని అన్ని రంగాలపై పడుతుంది.

 ఇలా Inflation వల్ల దేశం దాదాపు కోలుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. 1997-2008 దశకంలో జింబాబ్వే hyper inflation ని ఒక చక్కటి ఉదాహరణ గా ఇక్కడ పరిగణించవచ్చు. 1980లో బ్రిటిష్ వారి నుండి స్వాతంత్రం పొందింది జింబాబ్వే. ఆ దేశపు ఆర్ధిక ఆదాయంలో అక్కడి పంటలు ప్రముఖ పాత్ర పోషించాయి. ఆ దేశ మొత్తం జనాభాలో తెల్ల జాతీయులు 5 శాతం గా ఉన్నారు. వాల్ల చేతుల్లోనే 80శాతం భూములు ఉన్నాయి. అయితే స్వాతంత్రాణాంతరం అప్పటి ప్రైమ్ మినిస్టర్ రాబర్ట్ ముగాబే భూముల అప్పగింత కార్యక్రమం చేపట్టాడు. తెల్ల జాతీయులు దగ్గర ఉన్న భూముల్ని , దేశ పౌరులకి ఇవ్వడం మొదలుపెట్టాడు. అయితే తెల్ల జాతీయులకి పంటలు పండించండం, వాటి నిర్వహణ పైన ఉన్నంత పట్టు అక్కడి దేశస్థులకి లేకపోవడం వల్ల తయారీ విధానం ఘోరంగా దెబ్బతిన్నది. ఫలితంగా అప్పటివరకు అక్కడ పండించే పంటలు ఎగుమతి చేసే దేశం, ఈ మార్పు వల్ల దిగుమతి చేసుకునే స్థాయికి దిగజారింది. ఇది దేశ ఆర్థిక వ్యవస్థ పైన తీవ్ర ప్రభావం చూపింది.


Thosand dollar note

Trillion dollar note


ఆర్ధిక వ్యవస్థ కుదెలవుతున్నా కూడా ముగాబే ప్రభుత్వం ఏ మాత్రం శ్రద్ధ చూపలేదు. 1998 నుండి 2003 వరగిన రెండవ కాంగో యుద్ధం (second Congo War) కోసం అధిక మొత్తం లో ధనం ఖర్చు చేసి ముగాబే, దేశ సైనికులని యుద్ధం లో పాల్గొనమని పంపడం జరిగింది. ఈ చర్య వల్ల దేశం లో రిసర్వ్ లో ఉన్న ధనం కాస్తా ఐపోవచ్చింది. ఇక చేసేది లేక అక్కడి నేషనల్ బాంక్ లో అధికంగా ధనం ముద్రించడం ప్రారంభించింది. సైనికులకు, ఉద్యోగులకు జీతాలు, ప్రభుత్వ నిర్వహణ కోసం, ఇతరాత్ర అప్పులు తీర్చడం కోసం ఈ పని చేసింది.  

దేశం లో అవసరానికంటే ఎక్కువ ధనం పొగవడం వల్ల నిత్యావసరాల ధరలు చుక్కలను అంటడం జరిగింది. ఎంతలా అంటే ఒక్క బ్రెడ్ ముక్కకి (not packet ) 10,000 జింబాబ్వే డాలర్స్ ఇవ్వాల్సి వచ్చేది. విపరీతంగా పెరిగిపోతున్న ధరల వల్ల ప్రభుత్వం అప్పటికి ఉన్న నోట్ల తో పాటు కొత్త డినామినేషన్ నోట్ల ని ప్రవేశ పెట్టింది (10,000, 20,000, 50,000, 100,000, 1 trillion dollar నోట్లని మార్కెట్లో ప్రవేశపెట్టింది). ఇక చేసేదేం లేక 2009, ఏప్రిల్ లో దేశ కరెన్సీ ని రద్దు చేసి, అమెరికన్ డాలర్ వినియోగానికి సిద్ధపడింది. 

Index


ఇక్కడ గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే, 1983 లో ఒక్క జింబాబ్వే డాలర్ 1 US డాలర్ తో సమానంగా ఉండేది.  2008 నాటికి 1 US డాలర్ = 669,000,000,000 జింబాబ్వే డాలర్స్ గా ఉంది. అంటే మన ఒక్క రూపాయి విలువ అక్కడ 15 కోట్ల 50 లక్షలు అయ్యింది 2008 లో. 

Comments

Popular posts from this blog

సైలెంట్ పేషెంట్ - ఒక మంచి థ్రిల్లర్ (Book)

. .మీకు పుస్తకాలు చదివే అలవాటు ఉందా? అందులోనూ క్రైమ్ మరియు సైకలాజికల్ పుస్తకాలు చదవడానికి ఇష్ట పడతారా? అయితే మీరు ఈ పుస్తకం (నవల) తప్పకుండా చదివి తీరాల్సిందే. పలు చిత్రాలకు స్క్రీన్ రైటర్ గా పనిచేసిన "అలెక్స్ మైఖెలీడిస్ (Alex Michaelides)" రచయితగా చేసిన తొలి ప్రయత్నం "ది సైలెంట్ పేషెంట్ (The Silent Patient)". ఈ నవల న్యూయార్క్ టైమ్స్ (Newyork times) మరియు సన్ డే టైమ్స్ (Sunday Times) వారి బెస్ట్ సెల్లర్ బుక్స్ లో ఒకటిగా నిలిచి చాలా మంది పాఠకుల చే ప్రశంశలు కూడా పొందింది. ఈ నవల మొత్తం ఒక హత్య చుట్టూ తిరుగుతూ ఉంటుంది. చిత్రకారిని (Artist) అయిన ఒక మహిళ తన భర్తను అతి క్రూరంగా 5 సార్లు తలపై (point blank లో) కాల్పులు జరిపి చంపేస్తుంది. ఆ హత్య వెనుక ఉన్న కారణాలు తెలుసుకోవడానికి ఒక సైకోతెరపిస్టు జరిపే ప్రయత్నమే ఈ సైలెంట్ పేషెంట్. హత్య చేసిన మహిళ, ఆ సంఘటన తర్వాత అసలు ఎవరితో మాట్లాడకుండా, మానసికంగా కృంగిపోయి ఒక ఆసుపత్రి లో చేర్చబడుతుంది, ఆమెతో మాట్లాడించి నిజం తెలుసుకోవడానికి ఒక తెరపిస్టు జరిపే ప్రయత్నం "ది సైలెంట్ పేషెంట్". నవల మొదట్లో కొంచెం మెల్లిగా సాగుతున్నట్టు అ

స్వీడన్ లో అసలేం జరుగుతుంది?

ఆగష్టు 28, శుక్రవారం నాడు ఇస్లాం మతానికి వ్యతిరేకంగా జరుగుతున్న చర్యలని నిరసిస్తూ సుమారు 300 మంది ప్రజలు స్వీడన్ నగరమైన మాల్మో లో నిరసన చేపట్టారు, ఇందువల్ల అక్కడ అల్లర్లు చెలరేగాయి. వార్త మాధ్యమాల ప్రకారం నిరసనకారులు పోలీస్ ల పైకి రాళ్లు రువ్వడం మరియు వాహనాల టైర్ లు తగలబెట్టడం జరిగింది.   అల్లర్లకు గల కారణం:  ముస్లిం ల పవిత్ర గ్రంధమైనా ఖురాన్ ని స్ట్రాం కుర్స్ అనే డేనిష్ పార్టీ కి చెందిన నాయకులు తగలబెట్టడం తో అక్కడ అల్లర్లు చెలరేగాయి . డేనిష్ లాయర్ రాస్ముస్ పలుదో అనే వ్యక్తి 2017 వ సంవత్సరం లో స్థాపించిన పార్టీ స్ట్రాం కుర్స్. రాస్ముస్ మొదటినుండి ఇస్లాం వ్యతిరేకుడని పేరు ఉంది. ఏప్రిల్ 14 నాడు తన అధ్యక్షతన జరిగిన ఒక సమావేశం లో ఖురాన్ ని విసిరివేయడం ద్వారా వార్తల్లో నిలిచాడు రాస్ముస్. అలాగే తన ఇస్లాం వ్యతిరేక చర్యలలో భాగంగా యూట్యూబ్ లో రెచ్చగొట్టే వీడియొ లు పోస్ట్ చేయడం మరియు తన పార్టీ సామజిక మాధ్యమాల్లో కూడా అడపాదడపా ఇస్లాం వ్యతిరేక పోస్ట్ లు చేసేవారు. ఈ చర్యల వాళ్ళ రాస్ముస్ గతం లో 3 నెలల జైలు శిక్ష కూడా అనుభవించాడు.   అల్లర్లు జరగడానికి ముందు, పార్టీ నాయకుడు రాస్ముస్ మాల్మో నగరం